ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సమీక్ష నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎరువుల లభ్యత, సరఫరా, క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. కాకినాడ సమీపంలో గ్యాస్ లీక్ ఘటనపైనా చంద్రబాబు ఆరా తీశారు. లంక గ్రామాల ప్రజలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు.
కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు
August 22, 2025
0
Tags