తాను ఇప్పుడు ఏ పార్టీ వైపునకు చూసేటట్లుగా లేను !

Telugu Lo Computer
0


తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, బీఆర్ఎస్ పార్టీల వైపా అన్నది కాదని తాను ఇప్పటికీ కూడా బీఆర్ఎస్‌లోనే ఉన్నానని క్లారిటీ ఇచ్చారు.  తాను ఇప్పుడు ఏ వైపునకు చూసేటట్లుగా కూడా లేనని స్పష్టం చేశారు. తనకు 73సంవత్సరాలు వచ్చాయని, ఇంకా ఏవైపునకు చూడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాను ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిని అయ్యానని ఇంకా మూడేళ్లు రాజకీయాల్లో ఉంటానని చెప్పుకొచ్చారు. అస్సలు తాను రాజకీయమే వద్దనుకుంటున్నానని తెలిపారు. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామని అనుకుంటున్నానని మల్లారెడ్డి పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)