తెలంగాణలో రూ.80వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన ఎన్టీపీసీ

Telugu Lo Computer
0


నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ తెలంగాణలో రూ.80వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్ సింగ్ బృందం శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు వివరించింది. సోలార్, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఎన్టీపీసీ సుముఖత తెలిపింది. రాష్ట్రంలో 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్‌ ఉత్పత్తికి అవకాశం ఉందని సీఎంకు ఎన్టీపీసీ బృందం తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాలా సహకరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)