అమెరికాలో వాణిజ్య ట్రక్కులు నడిపే విదేశీ డ్రైవర్లకు ఇకపై వర్క్ వీసాలు జారీ చేయబోమని తాజాగా ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా దేశాంగశాఖ మంత్రి మర్కో రూబియో ప్రకటించారు. విదేశీ డ్రైవర్ల కారణంగా అమెరికన్ల ప్రాణాలు పోతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూబియో పేర్కొన్నారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఇటీవల ఫ్లోరిడాలోని హైవేపై ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా యూటర్న్ తీసుకోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపథ్యంలో రుబియో ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విదేశీ ట్రక్కు డ్రైవర్లపై పలు ఆంక్షలు విధించిన ట్రంప్ ప్రభుత్వం అందులో భాగంగా ఇంగ్లీష్ చదవడం, రాయడం వచ్చి ఉండాలనే నిబంధన చేసింది. రోడ్లపై సూచికలు చదవకపోవడం, ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోవడం వల్లే అనేక ప్రమాదాలకు విదేశీ డ్రైవర్లు కారణమవుతున్నారని ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ పేర్కొంది. ఈ క్రమంలోనే నిబంధనలు కఠినతరం చేసింది.
అమెరికాలో వర్క్ వీసాలు జారీ నిలిపివేత !
August 22, 2025
0
Tags