ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్ధతు ఇవ్వడానికి వైసీపీకి సిగ్గుండాలని, 'వైసీపీ ముసుగు మళ్లీ తొలగిందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీకి బీ టీమ్ అని రుజువైంది. మోడీకి దత్తపుత్రుడే అని ప్రజలకు అర్థమైంది. బీజేపీకి బాబు, జగన్, పవన్. ముగ్గురూ మోడీ తొత్తులే. బీజేపీకి ఊడిగం చేసే బానిసలే. టీడీపీ, జనసేనది తెరమీద పొత్తు. వైసీపీది తెరవెనుక అక్రమ పొత్తు' అని ట్వీట్ చేశారు. వైసీపీ ముసుగు మళ్ళీ తొలగిందని, లోనున్న కాషాయ కండువా మరోసారి బయటపడిందని షర్మిల అన్నారు. బీజేపీకి వైసీపీ బీ-టీం అని నిజ నిర్ధారణ జరిగిందన్నారు. మోడీకి దత్తపుత్రుడే అని రాష్ట్ర ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు అర్ధం అయ్యింది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోడీ పక్షమేనని తేటతెల్లమైందని, బీజేపీ కోసమే పనిచేసే పక్షమేనని రుజువైందని అన్నారు. వైసీపీ తీరు రాష్ట్రంలో కూటమి పక్షాలతో కుస్తీ, ఢిల్లీలో మతపిచ్చి బీజేపీతో దోస్తీ అంటూ షర్మిల ఫైర్ అయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ కూటమి నిలబెట్టిన బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి వైసీపీకి సిగ్గుండాలి. అవినీతి కేసులకు భయపడి బీజేపీకి మళ్ళీ దాసోహం అన్నారు. ఐదేళ్లు దోచుకుతిన్నది దాచుకోడానికి బీజేపీకి జై కొట్టారు. ఈ దేశంలో ఓట్ చోరితో రాజ్యాంగం ఖూనీ అయ్యేది వైసీపీకి కనిపించదు. మోడీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే విమర్శించడానికి వైసీపీ నోరు పెకలదు. మణిపూర్, గోద్రా అల్లర్లలో ఆర్‌ఎస్ఎస్ చేస్తున్న రక్తపాతం మీద మౌనం వహిస్తారు. మోడీ అక్రమాలు బయటపెట్టే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురించి మాత్రం ఉవ్వెత్తున లేస్తారు'' అంటూ షర్మిల మండిపడ్డారు. మోడీకి ఆపద వచ్చిందని అండగా నిలబడతారు. ''ఈ దేశ ప్రతిపక్షాలన్నీ కలిసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడిని నిలబెడితే, బీజేపీ నిలబెట్టిన ఆరెస్సెస్ వాదికి మద్దతు ఇస్తారా ? ఇది తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం కాకపోతే మరేంటి ? దీనిపై రాష్ట్ర ప్రజలకు వైసీపీ సమాధానం చెప్పాలి'' అని డిమాండ్ చేశారు.
బీజేపీకి బాబు, జగన్, పవన్. ముగ్గురూ మోడీ తొత్తులే !
August 22, 2025
0
Tags