తిరుమలలోని హథీరాం బావాజీ మఠం కూల్చివేయద్దంటూ చంద్రబాబుకు ఎక్స్ వేదికగా కవిత విజ్ఞప్తి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిరుమలలోని పురాతన హథీరాం బావాజీ మఠాన్ని కూల్చివేయవద్దని డిమాండ్ చేస్తూ, ఈ నిర్ణయం హథీరాం బావాజీని ఆరాధించే బంజారా భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని కవిత పేర్కొన్నారు. ఆమె పోస్టులో, భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడుని కోరారు. హథీరాం బావాజీ మఠం కూల్చివేతతో తమ బతుకుదెరువు పోతుందని అక్కడి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురాతన నిర్మాణం కావడంతో అధికారులు కూల్చివేతకు టెండర్లు కూడా పూర్తి చేశారు. ఇలాంటి సమయంలో కవిత చేసిన విజ్ఞప్తి ఆసక్తికరంగా మారింది. హథీరాం బావాజీ మఠానికి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)