అమెరికాలోకి వచ్చే ఫర్నీచర్‌పై సుంకాలు పెంపు ?

Telugu Lo Computer
0


మెరికాలోకి వచ్చే ఫర్నీచర్‌పై మేం భారీస్థాయిలో టారిఫ్ ఇన్వెస్టిగేషన్‌ నిర్వహిస్తున్నాం. 50 రోజుల్లో ఆ విచారణ పూర్తవుతుందని ట్రంప్  ట్రూత్‌ సోషల్ వేదికగా పోస్టులో పేర్కొన్నారు. అయితే ఎంతమేరకు సుంకం విధిస్తారనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. నార్త్‌ కరోలినా, సౌత్‌ కరోలినా, మిషిగన్‌కు తిరిగి ఫర్నీచర్‌ పరిశ్రమను తిరిగి తీసుకురావడానికే ఈ చర్యలని పేర్కొన్నారు. యూఎస్‌లో ఫర్నీచర్‌, సంబంధిత పరిశ్రమలో జులై నాటికి 3,40,000 మంది ఉపాధి పొందుతున్నారు. 2000 సంవత్సరంతో పోల్చుకుంటే సగం మందే ఇప్పుడు ఆ రంగంలో పనిచేస్తున్నారు. అమెరికాకి ఫర్నీచర్‌ను ఎగుమతి చేసే దేశాల్లో చైనా, వియత్నాం ముందువరుసలో ఉన్నాయి. 2024లో 25.5 బిలియన్‌ డాలర్ల విలువైన సామాగ్రిని అమెరికా దిగుమతి చేసుకుందని గణాంకాలు వెల్లడించాయి. ఇప్పటికే స్టీల్‌, అల్యూమినియం, ఆటో, ఇతర రంగాలపై ట్రంప్ సుంకాలు వేశారు. ఫార్మా, చిప్స్‌, క్రిటికల్ మినరల్స్ దిగుమతులపై పలు విచారణలు జరుగుతున్నాయి. ఇక భారత్‌పై రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు అదనపు సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఆగస్టు 27 నుంచి 50శాతం సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో వీటి గడువును ట్రంప్‌ పొడిగిస్తారని తాను ఆశించడం లేదని వైట్‌హౌస్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నరావో ఇప్పటికే పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)