బుగ్గ వద్ద కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన : తాడిపత్రి-నంద్యాల మార్గంలో మూడు కిలోమీటర్ల మేర నిలిచిన రాకపోకలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి వాగులు పొంగుతున్నాయి. పెన్నా నది వరదలతో బుగ్గ వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో తాడిపత్రి-నంద్యాల మార్గంలో మూడు కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి. బుగ్గ సమీపంలో తాత్కాలిక వంతెన తెగిపోవటంతో నిర్మాణంలో ఉన్న నేషనల్ హైవే కొత్త రహదారిపై వెళ్తున్న లారీ మట్టిలో ఇరుక్కుపోయింది. దీంతో తాడిపత్రి నుంచి నంద్యాల, జమ్మలమడుగు వెళ్లే వాహనాలు సుమారు మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. లారీ ఇరుక్కుపోయిన ప్రాంతంలో వంతెన నిర్మాణం చేస్తుండటంతో సమస్య తలెత్తింది. అధికారులు ఇరుక్కుపోయిన లారీని బయటకు తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలూరు కోనకు వెళ్లే రహదారి ఆవుల తిప్పాయపల్లి సమీపంలో వంక ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇది గమనించని జీపు డ్రైవర్‌ తన వాహనాన్ని అందులో నుంచి తీసుకెళ్లడానికి ప్రయత్నించగా నీటిలో కొట్టుకుపోయింది. డ్రైవర్ కిందకు దూకి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. అనంతరం గ్రామస్థుల సహకారంతో కొట్టుకుపోయిన వాహనాన్ని బయటకు తీశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)