భవిష్యత్తులో బ్లూ-కాలర్ ఉద్యోగాలు కూడా ఏఐ ప్రభావానికి గురవుతాయి : బిల్ గేట్స్

Telugu Lo Computer
0

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సీఎన్ఎన్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ  ఏఐ టూల్స్ వాడకం ద్వారా ఉద్యోగాలు నిలబెట్టుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ సరదాగా, శక్తివంతంగా ఉంటుందని, అయితే కేవలం డిజిటల్ నైపుణ్యాలు ఉద్యోగాల తొలగింపు (లే ఆఫ్స్ ) నుంచి రక్షించలేవని ఆయన తేల్చిచెప్పారు. అయితే యువతకు తాను గతంలో ఇచ్చిన సలహానే ఆయన మరోసారి ఇచ్చారు. ఏఐపై ఆసక్తి పెంచుకోవాలని, సరికొత్త టూల్స్ వాడాలని బిల్ గేట్స్ సూచించారు. ఏఐ వల్ల ఉత్పాదకత మరింత పెరుగుతుందని, ఇది కార్మికులకు ప్రయోజనం చేకూరుస్తుందని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ఉత్పాదకత పెరిగితే అది మంచిదేనన్నారు. తద్వారా ఉద్యోగులు ఎక్కువ సెలవులు తీసుకోవడానికి లేదా, ఇంకా ఎక్కువ పని చేయడానికి వీలు కల్పిస్తుందన్నారు. కాబట్టి ఇది చెడు విషయం కాదని బిల్ గేట్స్ తెలిపారు. ఏఐ సాధారణ కోడింగ్ పనులను ఆటోమేట్ చేయగలదని గేట్స్ అంగీకరించారు. కాబట్టి ఉద్యోగాలు కావాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని గేట్స్ సూచించారు. అయితే మరింత సంక్లిష్టమైన పనులు ప్రస్తుతం దాని పరిధికి బయట ఉన్నాయని బిల్ గేట్స్ వెల్లడించారు. భవిష్యత్తులో బ్లూ-కాలర్ ఉద్యోగాలు కూడా ఏఐ ప్రభావానికి గురవుతాయని ఆయన అంచనా వేశారు. రోబోటిక్ చేతులు మెరుగ్గా మారినప్పుడు పెద్ద ఎత్తున శ్రామిక తరగతిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాయని గేట్స్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం మాత్రం వాటి పరిస్ధితి ఆ స్ధాయిలో లేదన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)