మైక్రోసాఫ్ట్‌ క్యాంపస్‌లో భారతీయ ఇంజినీర్‌ మృతి !

Telugu Lo Computer
0


మెరికా సిలికాన్‌ వ్యాలీలోని మైక్రోసాఫ్ట్‌ క్యాంపస్‌లో భారతీయ యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతిచెందాడు. ఆగస్టు 19న ప్రతీక్‌పాండే అనే ఇంజినీర్‌ విధులకు హాజరయ్యాడు. ఆ తర్వాత అతడు తెల్లవారుజామున మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం వారికి తెల్లవారుజామున 2 గంటలకు సమాచారం వచ్చింది. అక్కడ ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు వారికి కనిపించలేదు. దీనిని అనుమానాస్పద మరణంగా భావించడంలేదని మౌంటేన్‌ వ్యూ పోలీసులు పేర్కొన్నారు. అతడు తరచూ ఆఫీస్‌లో లేట్‌నైట్‌ వరకు పనిచేసేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతడి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని శాంటక్లారా కౌంటీ మెడికల్‌ ఎగ్జామినర్‌ పేర్కొన్నారు. ఈ విషయంపై మాట్లాడేందుకు మైక్రోసాఫ్ట్‌ నిరాకరించింది. ఆ సంస్థ కూడా ప్రతీక్‌ మరణంపై దర్యాప్తు చేస్తోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చెప్పారు. మైక్రోసాఫ్ట్‌ ఫ్యాబ్రిక్‌ ప్రొడక్ట్‌లో ప్రతీక్‌ పనిచేసేవాడు. అతడు క్లౌడ్‌, ఏఐ చీఫ్‌ స్కాట్‌కు రిపోర్టు చేసేవాడు. 2020లో ఈ సంస్థలో చేరక ముందు వాల్‌మార్ట్‌, యాపిల్‌ ఐఎన్‌సీలో ఉద్యోగాలు చేశాడు. శాన్‌జోస్‌ స్టేట్‌ యూనివర్శిటీలో చదువుకొన్నాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)