ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కార్యాలయం వద్ద సినీ కార్మికులు ఆందోళన

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ లోని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కార్యాలయం వద్ద సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనలో 24 యూనియన్ల సినీ కార్మికులు పాల్గొన్నారు. సినీ కార్మికుల వేతనాలకు సంబంధించిన అంశం మరింత జఠిలంగా మారింది. శనివారం నిర్మాతలు, కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలు కొలిక్కిరాలేదు. నిర్మాతలు మూడు కేటగిరీలుగా విభజించి, కార్మికుల వేతనాల్ని పెంచాలని నిర్ణయించారు. అయితే, నిర్మాతల నిర్ణయంపై కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఆదివారం నుంచి తమ ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కార్యాలయం వద్ద ఆదివారం ఉదయం ఆందోళన చేపట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)