హైదరాబాద్‌ లో ఖజానా జ్యువెలరీలో దోపిడీ దొంగల బీభత్సం

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ లోని చందానగర్‌లో ‘ఖజానా జ్యువెలర్స్’లో దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. దొంగతనంను అడ్డుకున్న సిబ్బందిపై దాడి చేయడమే కాకుండా, కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో షాపులోని పలువురు సిబ్బందికి గాయాలు అయ్యాయి. పోలీసుల రంగప్రవేశంతో దుండగులు షాప్‌లో నుంచి తప్పించుకుపోయారు. కేసు నమోదు చేసిన చందానగర్‌ పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. దుండగులు ముందుగా ఖజానా జ్యువెలర్స్ గేట్ సిబ్బందిని గాయపరిచి లోపలికి ప్రవేశించారు. షాప్‌ లోపల బంగారు ఆభరణాలకు సంబందించిన స్టాల్స్ పగలగొట్టారు. ఎదురుతిరిగిన సిబ్బందిపై తుపాకీతో కాల్పులు జరిపారు. మరికొందరిపై దాడులకు సైతం పాల్పడ్డారు. లాకర్ కీ ఇవ్వకపోవడంతో గన్ తీసుకొని బెదిరించారు. దుండగుల ముఠా అసిస్టెంట్ మేనేజర్‌పై కాల్పులు జరిపింది. స్టాఫ్ సిబ్బంది ఒకరు పోలీసులకు కాల్ చేయగా వెంటనే వారు ఖజానా జ్యువెలర్స్ షాప్‌కు చేరుకున్నారు. పోలీసులను చూసి దొంగల ముఠా పారిపోయింది. గ్యాంగ్‌లో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నట్లు సమాచారం. దుండగుల కోసం పది ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)