దేశంలో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు స్టార్‌లింక్ సంస్థకు ప్రభుత్వం అనుమతించింది. అయితే భారతీయ వినియోగదారుల డేటాను విదేశాలకు రూటింగ్ చేయడం, కాపీ చేయడం, డీక్రిప్ట్ చేయడం వంటివి నిషేధమని కేంద్రం స్పష్టం చేసింది. యూజర్ ట్రాఫిక్ ఎక్కడా విదేశీ సర్వర్‌లకు మిర్రర్ అవకుండా ఉండేందుకు దేశంలోనే ఎర్త్ స్టేషన్ గేట్‌వేలను ఏర్పాటు చేయాలని షరతులు విధించింది. ఈ నిబంధనలకు అంగీకరించిన తర్వాతే టెలికమ్యూనికేషన్ విభాగం స్టార్‌లింక్‌కి యూనిఫైడ్ లైసెన్స్ మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. భద్రతా నిబంధనల ప్రకారం భారత్‌లో ఎర్త్ స్టేషన్ గేట్‌వేలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పెమ్మసాని చెప్పారు. వీటి ప్రకారం.. భారతీయ వినియోగదారుల శాటిలైట్ కమ్యూనికేషన్ ట్రాఫిక్ ఏ విధంగానూ విదేశాల్లోని గేట్‌వేల ద్వారా వెళ్లకూడదు. భారతీయ డేటాను విదేశాల్లో కాపీ చేయడం, డీక్రిప్ట్ చేయడం పూర్తిగా నిషేధం. యూజర్ ట్రాఫిక్‌ను ఎక్కడా విదేశీ సర్వర్‌లకు మిర్రర్ చేయకూడదు. అలాగే శాటిలైట్ ఆధారిత సేవలందించడానికి స్పెక్ట్రం కేటాయింపు, స్పెక్ట్రం ధరలతో సహా నిబంధనలపై టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) సిఫార్సులు కోరిందని.. ఆ సిఫార్సులు మే 9న అందాయని ఆయన తెలిపారు. "ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ సేవలు రాబోయే కాలంలో పెద్ద ఆర్థిక కార్యకలాపాలుగా ఎదుగుతాయి. దీని ద్వారా ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా టెలికాం నెట్‌వర్క్ ఇన్‌స్టాలేషన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ వంటి విభాగాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయని" అని మంత్రి పేర్కొన్నారు.
భారత్ లో స్టార్‌లింక్ సేవలకు గ్రీన్ సిగ్నల్!
August 24, 2025
0
Tags