గాల్లో ఉండగానే విరిగిన విమానం రెక్క : సేఫ్ గా ల్యాండ్ పైలట్

Telugu Lo Computer
0


మెరికాలోని ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణిస్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్  బోయింగ్ 737 విమానం 1893 ఫ్లాప్ విరిగి గాల్లోనే వేలాడింది. విమానం ల్యాండ్ కావడానికి ముందే, దాని ఎడమ రెక్క ఫ్లాప్ పాక్షికంగా విరిగి వేలాడుతోంది. దీనిని చూసి, విమానంలోని ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఇక తమ ప్రాణాలు గాల్లో కలిసినట్టే అని భావించారు. కానీ పైలట్స్ చాకచక్యంగా వ్యవహరించి సేఫ్ గా ల్యాండ్ చేశారు. ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ల్యాండింగ్ తర్వాత, డెల్టా ఎయిర్‌లైన్స్ ఫ్లాప్ విరిగిపోయిందని నిర్ధారించి, విమానాన్ని మెయిన్ టెనెన్స్ కోసం పంపించారు. మా ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని ఎయిర్‌లైన్ తెలిపింది. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించింది. ఎఫ్ఏఏ దర్యాప్తుకు సహకరిస్తామని ఎయిర్‌లైన్ తెలిపింది. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఫ్లాప్‌లు అదనపు లిఫ్ట్, నియంత్రణను అందించడంలో సహాయపడతాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)