హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో అత్యంత దారుణంగా పదేళ్ల బాలికను హత్య చేసిన విషయం తెలిసిందే. దాదాపు 20 సార్లు కిరాతకంగా పొడిచి హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ నెల 18న ఈ విషాద ఘటన చోటు చేసుకోగా పోలీసులు ఈ మర్డర్ మిస్టరీని చేధించారు. అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు 10 వ తరగతి చదివే విద్యార్థి కావడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. కృష్ణ-రేణుక దంపతులు ఐదేళ్లుగా కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో నివసిస్తున్నారు. కృష్ణ మెకానిక్ షెడ్డులో పనిచేస్తున్నాడు, రేణుక ప్రైవేట్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్. వీరికి 10 ఏళ్ల కుమార్తె సహస్ర, 7 ఏళ్ల కుమారుడు ఉన్నారు. సహస్ర బోయిన్‌పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. కుమారుడు ఇంటికి సమీపంలోని బడికి వెళ్తున్నాడు. 18వ తేదీ ఉదయం క్రీడోత్సవాల కారణంగా సహస్ర చదివే పాఠశాలకు సెలవు ఇచ్చారు. తల్లిదండ్రులు పనులకు వెళ్లగా, బాలిక తమ్ముడు స్కూల్ కి వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. అయితే మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 'లంచ్ బాక్సు తీసుకురాలేదేమంటూ' స్కూల్ సిబ్బంది కృష్ణకు ఫోన్ చేయడంతో ఆయన హుటాహుటిన ఇంటికి వెళ్లారు. తలుపు బయట నుంచి గడియ పెట్టి ఉండటంతో ఓపెన్ చేసి చూడగా శరీరంపై కత్తిపోట్లతో మంచంపై విగతజీవిగా సహస్ర కనిపించింది. కన్న కూతురిని అలా చూడలేక కుప్పకూలిపోయాడు కృష్ణ. అతడి కేకలు విన్న స్థానికులు సైతం బాలికను చూసి శోక సంద్రంలో మునిగిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ప్రాథమిక నివేదిక ప్రకారం, సహస్ర శరీరంపై 20 వరకు కత్తిపోట్ల గాయాలు ఉన్నాయి. మెడపైనే 10 గాయాలు ఉన్నాయని, హత్య 9.30 నుంచి 10.30 మధ్య జరిగిందని పోలీసులు గుర్తించారు. అదే సమయంలో పక్క భవనంలోని వారు కూడా సహస్ర కేకలు విన్నారని తెలిపారు. దర్యాప్తులో హత్య చేసిన వ్యక్తి 10వ తరగతి చదువుతున్న బాలుడుగా బయటపడింది. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలు సేకరించి, గత ఐదు రోజులుగా అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు ముందే దోపిడి ప్రణాళిక రూపొందించుకున్నాడని, ఇంట్లో దేవుడి హుండీని పగులగొట్టి డబ్బులు దొంగిలించేందుకు ప్లాన్ చేసినట్టు గుర్తించారు. అందుకు గాను నేరాన్ని ఎలా చేయాలో, ఇంట్లోకి ఎలా ప్రవేశించాలో, ఎలా పారిపోవాలో ఇంగ్లీష్‌లో రాసి ఒక 'హౌ టు' గైడ్ సిద్ధం చేసుకున్నట్టు తెలిపారు. సహస్ర తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో, పక్క బిల్డింగ్ నుంచి ఇంట్లోకి చేరుకున్నాడు. హుండీని పగులగొట్టే ప్రయత్నం చేస్తుండగా సహస్ర అతడిని చూసింది. ఈ క్రమంలోనే నిందితుడు కత్తితో దాడి చేసి 18-20 సార్లు వరుసగా పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత పక్క బిల్డింగ్‌లో దాదాపు 15 నిమిషాలపాటు దాక్కున్నాడు. ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సమాచారం అందించడం వల్ల, ఎస్‌వోటీ బృందం స్కూల్‌కు చేరి బాలుడిని గుర్తించింది. నిందితుడు ఇంట్లో తనిఖీలలో కత్తి, రక్తపుమచ్చలతో ఉన్న దుస్తులు, హత్యలో వాడిన లెటర్ వంటి ఆధారాలు సేకరించారు.
వీడిన కూకట్‌పల్లి బాలిక మర్డర్ మిస్టరీ !
August 22, 2025
0
Tags