'మా ఎంపీ కనిపించడం లేదు' : కేంద్ర మంత్రి సురేశ్ గోపీపై కేరళ విద్యార్థి సంఘం ఫిర్యాదు

Telugu Lo Computer
0


కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి సురేశ్ గోపీపై పోలీస్ ఫిర్యాదు నమోదైంది. త్రిస్సూర్ ఎంపీగా కొనసాగుతున్న ఆయనపై కేరళ విద్యార్థి యూనియన్ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా కంప్లైంట్ చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో మలయాళీ నర్సులు అరెస్టు అయినప్పటి నుంచి తమ 'ఎంపీ సురేశ్ గోపీ కనపడుట లేదు' అని స్టూడెండ్ యూనియన్ తమ ఫిర్యాదులో పేర్కొంది. త్రిస్సూర్‌లోని ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో తమ ఎంపీపై ఫిర్యాదు అనంతరం ఎస్‌కేయూ జిల్లా అధ్యక్షుడు గోకుల్ గురువయూర్ మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్‌లో కేరళ నర్సులపై కుట్రపూరితంగానే కేసు పెట్టారని ఆరోపించాడు. 'గత రెండు నెలల నుంచి మా ప్రాంత ఎంపీ, కేంద్ర మంత్రి సురేశ్ గోప్ నియోజకవర్గంలోని కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. మానవ అక్రమ రవాణా కేసు కింద ఛత్తిస్‌గఢ్‌లో కేరళకు చెందిన ఇద్దరు నర్సులను అక్రమంగా అరెస్ట్ చేశారు. అదొక కుట్రపూరిత కేసు. ఆ రోజు నుంచి ఎంపీ సురేశ్ గోపీ తమ నియోజకవర్గంలో కనిపించడం లేదు. అందుకే మా విద్యార్థి సంఘం తరఫున పోలీసులకు ఆయనపై మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాం. మా ఎంపీని సగటు పౌరుడే కాదు మేయర్ కూడా కలవలేరు. ఆయన ఆఫీస్‌కు ఫోన్ చేసి ఎంపీ ఉన్నారా? లేరా? అని అడిగితే సిబ్బంది ఎలాంటి సమాధానం చెప్పడం లేద'ని గోకుల్ పేర్కొన్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)