జమ్మూకశ్మీర్‌లో చొరబాట్ల స్పెషలిస్ట్, వందకు పైగా చొరబాట్లకు కారకుడు, ఉగ్రవాద క్యాడెర్‌లో హ్యూమన్ జీపీఎస్ గా పిలువబడే బాగూఖాన్‌ను ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు కాల్చిచంపాయి. సమందర్ చాచాగా కూడా పాపులర్ అయిన బాగూఖాన్ 1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాడు. ఎలాంటి క్లిష్ట మార్గాలలోనైనా ఉగ్రమూకలను భారత్‌లోకి చొరబడేలా ఇతను సహాయం చేసేవాడు. నౌషెరా నార్ ఏరియాలో మరో ఉగ్రవాదితో కలిసి చొరబాటు ప్రయత్నం చేస్తుండగా భద్రతా దళాలు శనివారంనాడు కాల్చిచంపాయి. సెక్యూరీటి గ్రిడ్ వర్గాల సమాచారం ప్రకారం, గురెజ్ సెక్టార్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వందకు పైగా చొరబాట్లకు బాగూఖాన్ సూత్రధారిగా వ్యవహరించాడు. ఆ ప్రాంతంలోని రహస్య మార్గాలు అణువణువునా తెలిసి ఉండటంతో చొరబాటు యత్నాలన్నీ దాదాపు విజయవంతమయ్యాయి. బాగూఖాన్ హిజ్బుల్ కమాండర్‌గా ఉన్నప్పుడు గురెజ్ సెక్టార్ నుంచి నియంత్రణ రేఖ వెంబడి దేశంలోకి చొరబడేందుకు ఉగ్ర సంస్థలకు సహకరించేవాడు. ఏళ్ల తరబడి భద్రతా బలగాల కళ్లుకప్పి తిరుగుతున్న బాగూఖాన్ అదృష్టం తాజా చొరబాటు యత్నంలో తిరగబడంది. భద్రతా బలగాలు మట్టుబెట్టడంతో అతని ఆటకట్టింది.
ఎన్‌కౌంటర్‌లో బాగూఖాన్ హతం
August 30, 2025
0
Tags