మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భాజపాలో చేరిక

Telugu Lo Computer
0


తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు భాజపాలో చేరారు. ఆదివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు రామచందర్‌రావు భాజపా కండువా కప్పి బాలరాజును పార్టీలోకి ఆహ్వానించారు. భాజపా పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బాలరాజు పార్టీలోకి రావడం హర్షణీయమన్నారు. తెలంగాణలో భాజపా బలోపేతానికి ఆయన సేవలు వినియోగించుకుంటామన్నారు. ఎంపీ లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పలువురు సీనియర్‌ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)