ఈ ఏడాది జూన్ 26న జార్జియాలోని ఓ ఇంటిపై పట్టపగలు పడిన ఉల్క రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. మెక్‌డొనౌగ్‌లోని ఓ ఇంటిపై ఉన్న ఇన్సులేషన్, ఇతర అడ్డంకులను ఛేదించుకొని భూమిపై సెంటీమీటరున్నర చిన్న గుంతకు ఆ ఉల్క కారణమైంది. ఈ ఘటన జార్జియా, దక్షిణ కరోలినా రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. చిన్న చెర్రీ టమాటా సైజులో ఉన్న ఈ ఉల్క శకలం కేవలం 23 గ్రాములే ఉంది. ఇది సూపర్ సోనిక్ వేగంతో భూమిపై పడినప్పుడు వచ్చిన శబ్దం చుట్టుపక్కల కౌంటీలకూ వినిపించింది. జార్జియాలోని శాస్త్రవేత్తలు ఈ శకలంపై పరిశోధనలు చేశారు. ఇది దాదాపు 4.56 బిలియన్ సంవత్సరాల క్రితం తయారైనట్లు జియాలజిస్ట్ స్కాట్ హారిస్ గుర్తించారు. అంటే భూమి కంటే 2 కోట్ల సంవత్సరాల పూర్వమని అభిప్రాయపడ్డారు. భూమి 4.54 బిలియన్ ఏళ్ల క్రితం ఏర్పడిందన్న అంచనాలున్నాయి. ఈ శకలం అంగారకుడు, బృహస్పతికి మధ్య ఉన్న ఓ తోక చుక్క నుంచి విడిపోయి ఉంటుందని భావించారు. ఈ ఉల్క శకలంపై శాస్త్రవేత్తతో సదరు ఇంటి యజమాని మాట్లాడాడు. తన లివింగ్ రూమ్‌లో ఇప్పటికే ఖగోళ ధూళి కణాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. తన ఇంటిని ఢీకొన్న వేళ.. సోనిక్ బూమ్, పైకప్పును తాకిన చప్పుడు, నేలను తాకిన శబ్దం వినిపించాయన్నారు. ఓ భారీ రైఫిల్‌ను తనకు దగ్గరగా పేల్చినట్లు అనిపించిందన్నారు.
జార్జియాలో ఉల్క శకలం 4.56 బిలియన్ సంవత్సరాల క్రితం తయారైనట్లు గుర్తింపు !
August 10, 2025
0
Tags