ఇటీవల కన్నుమూసిన జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ సంతాప సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాయ్ గఢ్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. శిబూ సోరెన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడిన శిబూ సోరెన్ ఈ నెల 4వ తేదీన ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. సంతాప సభ సందర్భంగా ఆయన చేసిన సేవలను రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. శిబు సోరెన్ జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభుత్వం తన సొంత నిధులతో హైదరాబాద్‌లో ఆయన పేరిట స్మారక భవన్‌ను నిర్మిస్తామని అన్నారు. గిరిజన నాయకుడు బిర్సా ముండాను ఆదర్శంగా తీసుకుని శిబు సోరెన్ తన జీవితాంతం జార్ఖండ్ ప్రజల కోసం కష్టపడ్డారని రేేవంత్ రెడ్డి అన్నారు. దీనికోసమే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో శిబూ సోరెన్ తెలంగాణకు వచ్చి సంఘీభావాన్ని తెలియజేశారని గుర్తు చేశారు. తెలంగాణ సమాజం ఆయన కుటుంబానికి అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శిబు సోరెన్ జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభుత్వం నిధులతో హైదరాబాద్‌లోని శిబు సోరెన్ భవన్‌ను నిర్మిస్తామని అన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం చివరి వరకూ శ్రమించిన శిబూ సోరెన్ జీవితం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సోరెన్ చేపట్టిన అట్టడుగు స్థాయి ఉద్యమాలు ఆయనను గిరిజన నేతగా తీర్చిదిద్దాయని రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ఆయన నేతృత్వంలో దశాబ్దాలుగా సాగిన ఆందోళనల ఫలితంగా జార్ఖండ్ ఏర్పాటయిందని, ప్రత్యేక రాష్ట్ర పోరాటం ఫలించిందని చెప్పారు.
హైదరాబాద్ లో శిబూ సోరెన్ పేరిట భవన్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
August 16, 2025
0
Tags