భారీ డిస్కౌంట్‌తో భారత్‌కు చమురును ఆఫర్‌ చేస్తున్నరష్యా

Telugu Lo Computer
0


రష్యా భారీ డిస్కౌంట్‌తో చమురును భారత్‌కు ఆఫర్‌ చేస్తున్నట్లు డేటా ఇంటెలిజెన్స్‌ సంస్థ కేపీఎల్‌ఈఆర్‌ లిమిటెడ్‌ పేర్కొంది. ఉరల్స్‌ గ్రేడ్‌ క్రూడ్‌ డేటెడ్‌ బ్రెంట్‌ చమురు కంటే ఐదు డాలర్లు చౌకగా ఉంది. ఇవి దాదాపు రెండు వారాల క్రితం ఒకే రకంగా ఉండేవి. అమెరికా చర్యలు ఊహాతీతంగా ఉండటంతో ఉరల్స్ చమురు ధరలు మరింత పతనం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అమెరికా సెకండరీ ఆంక్షల భయం కారణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రష్యా నుంచి కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఆగస్టు నుంచి అక్టోబర్‌ మధ్యలో రష్యా చమురు ప్లాంట్ల మెయింటెనెన్స్‌ పనులు జరుగుతాయి. ఈ క్రమంలో అక్కడి నుంచి భారీ ఎత్తున ఆయిల్‌ను ఎగుమతి చేస్తారు. ఈ ఒత్తిడి కూడా ధరలపై పడుతోందని కేపీఎల్‌ఈఆర్‌ హుమయూన్‌ ఫాలాక్షాహి పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో రష్యా చమురుకు 37 శాతం మార్కెట్‌ వాటా ఉంది. దీనిని ఒక్కసారిగా తగ్గించుకోవాలంటే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కేపీఎల్‌ఈఆర్‌ పేర్కొంది. ప్రస్తుతం చమురు సంస్థలు కూడా రష్యా నుంచి కొనుగోళ్లను నిలిపివేసే అంశాన్ని ఆలోచిస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు కొనుగోళ్లను కొనసాగిస్తున్నాయి. మరోవైపు అమెరికా నుంచి చమురు కొనుగోళ్లు మే నుంచి మాత్రం రోజుకు 2,25,000 పీపాలకు చేరాయి. ఈ ఏడాది ప్రారంభంతో పోలిస్తే ఇవి రెట్టింపైనట్లు లెక్క.

Post a Comment

0Comments

Post a Comment (0)