హైదరాబాద్ లో మహిళపై చాకుతో దాడి

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌లో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఒక వ్యక్తి దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు వివరాలు ప్రకారం కేపీహెచ్‌బీలో నివాసం ఉంటున్న మణిమాల అనే మహిళ భర్త కొడుకుతో కలసి కిరాణా దుకాణం నిర్వహిస్తోంది. బుధవారం మధ్యాహ్నం మణిమాల ఒంటరిగా ఉన్న సమయంలో రాజు అనే వ్యక్తి ఇంటికి వెళ్లాడు. స్కూ డ్రైవర్ ఉందా అని అడిగి, ఇంతలోనే చాకుతో దాడి చేశాడు. రక్తస్రావమవుతున్న ఆమెను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాజు రెండు చేతులకి కూడా గాయాలయ్యాయి. అతణ్ని కూడా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పు అడిగినందుకే తనపై దాడి చేశాడని మణిమాల పోలీసులకు తెలిపింది. డబ్బు విషయమా, లేక దాడి చేయడానికి మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)