ఉత్తరాఖండ్‌లో మరోసారి మేఘ విస్ఫోటం : యువతి మృతి, పలువురి గల్లంతు

Telugu Lo Computer
0


త్తరాఖండ్‌లో మరోసారి మేఘ విస్ఫోటం సంభవించింది. చమోలీ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుంభవృష్టి కురిసింది. దీంతో అనేక నివాసాలను వరద నీరు ముంచెత్తింది. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. సగ్వారా గ్రామంలో ఓ యువతి శిథిలాల కింద కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయింది. వరదల కారణంగా పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ సమాచారమందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఇళ్లల్లో చిక్కుకుపోయిన స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి ఎక్స్‌ వేదికగా స్పందించారు. స్థానిక యంత్రాంగంతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)