యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రం మొదటి యూనిట్‌ను జాతికి అంకితం చేసిన మంత్రులు

Telugu Lo Computer
0


తెలంగాణలోని నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రం (వైటీపీఎస్‌)లోని 800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన మొదటి యూనిట్‌ను మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ జాతికి అంకితం చేశారు. కార్యక్రమంలో మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు యాదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రం (వైటీపీఎస్‌)లో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌కు మంత్రులు శంకుస్థాపన చేశారు. 55 ఎకరాల్లో రూ.970 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నారు. వనమహోత్సవంలో భాగంగా మంత్రులు ఇక్క మొక్కలు నాటారు. అనంతరం భూనిర్వాసితులతో మాట్లాడారు. ఆగస్టు 15 లోపు వారికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం 2015లో 800 మెగావాట్ల సామర్థ్యం గల 5 కేంద్రాల నిర్మాణం చేపట్టింది. 2017లో పనులు ప్రారంభించారు. సుమారు రూ.30వేల కోట్ల అంచనా వ్యయం కాగా మరో రూ.5వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండో యూనిట్‌ను గతేడాది డిసెంబరు 7న సీఎం ప్రారంభించారు. ఇప్పుడు ఒకటో యూనిట్‌ను జాతికి అంకితం చేసి పవర్‌గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. 3, 4వ యూనిట్‌ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి రానున్నాయి. 5వ యూనిట్‌ 2026 మార్చిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్లాంటుకు మూడు కిలోమీటర్ల సమీపంలో దుబ్బతండా వద్ద ఉద్యోగుల నివాస సముదాయాల కోసం సుమారు 60 ఎకరాల్లో మెగా టౌన్‌షిప్‌ నిర్మించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)