బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల నేటి నుంచి మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఒడిశా దిశగా కదులుతుంది. దీంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. బయటకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని లేకపోతే వెళ్లకూడదని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
August 15, 2025
0
Tags