కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా జేబులో పెట్టుకొని తిరుగుతోంది !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో మీడియాతో చిట్‌చాట్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ భాజపా మిత్రపక్షాలపై 3.5 శాతం మాత్రమే ఈడీ కేసులున్నాయని, మిగిలిన 96.5 శాతం విపక్షాలపైనే ఉన్నాయన్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా జేబులో పెట్టుకొని తిరుగుతోంది. అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి ప్రకారం ముందుకు పోతుంది. కాళేశ్వరం, ఫోన్‌ ట్యాపింగ్‌పై సమగ్రంగా చర్చించి ముందకు వెళ్తాం. బండి సంజయ్‌ ఆరోపణలు అర్థరహితంగా ఉన్నాయి. ఏఐసీసీ ఆదేశాల మేరకే జనహిత పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. ఈ పాదయాత్రకు పెద్ద ఎత్తున స్పందన వచ్చిందన్నారు. ప్రతినెల కొన్ని నియోజకవర్గాల్లో జనహిత పాదయాత్ర చేస్తానన్నారు. ఈ నెల చివరి వారంలో దీనికి రెండో దశ ఉంటుందని పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల ఢిల్లీ ధర్నాకు ఖర్గే, రాహుల్‌ గాంధీ రాలేకపోయారని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏఐసీసీ పరిశీలన చేస్తోంది. కొండా మురళి వ్యవహారం త్వరలో ముగిసిపోతుంది. అనిరుద్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. వివరణ కూడా తీసుకున్నాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. బీసీల కోరిక న్యాయబద్ధమైనది. ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు చేస్తున్నాయని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)