బెంగళూరులో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్సీబీ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం అందచేస్తామని తెలిపింది. తొక్కి సలాట జరిగిన 84 రోజుల తర్వాత మృతుల కుటుంబాలకు ఆర్సీబీ నష్టపరిహారం ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్లో ఆర్సీబీ ఈరోజు పోస్ట్ పెట్టింది. ''2025, జూన్ 4 మా హృదయాలు ముక్కలయ్యాయి. ఆర్సీబీ కుటుంబంలోని పదకొండు మంది సభ్యులను కోల్పోయాం. వారు మనలో భాగమే. ఇవాళ వాళ్లు మన మధ్యలో లేకపోయినా ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో ఉంటారు. ఎన్ని డబ్బులు ఇచ్చిన వారి స్థానాన్ని భర్తీ చేయలేం. కానీ మొదటి అడుగుగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాం. కేవలం ఆర్థిక సహయమే కాకుండా బాధిత కుటుంబాలకు నిరంతరం సంరక్షణగా ఉంటాం'' అని ఆర్సీబీ ట్వీట్లో పేర్కొంది.
బెంగళూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ఆర్సీబీ
August 30, 2025
0
Tags