యాప్ నెక్సస్ కో ఫౌండర్, మాజీ సీఈఓ బ్రియాన్ ఓ కెల్లీ 2018లో తన కంపెనీ విక్రయం ద్వారా వచ్చిన 1.6 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని (రూ.14,036.64 కోట్లు) ఎక్కువ భాగాన్ని విరాళంగా ఇచ్చేశానని వెల్లడించారు. ఫార్చ్యూన్ మ్యాగజైన్ వివరాల ప్రకారం 2018లో తన కంపెనీని అమ్మడం ద్వారా 1.6 బిలియన్ డాలర్ల సంపాదన వచ్చింది. అందులో ఎక్కువ భాగాన్నిఛారిటీకి ఇచ్చేశారు. కంపెనీలో 10 శాతం వాటా ఉన్న బ్రియాన్ ఓ కెల్లీ తన కుటుంబం కోసం వంద మిలియన్ డాలర్ల సంపాదన ఉంచుకున్నట్లు తెలిపారు. తన భార్యతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని, కుటుంబ అవసరాలకు ఎంత డబ్బు కావాలో తన సలహా మేరకే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాను బిలియనీర్లను నమ్మననీ, ఇది రెడిక్యులస్‌గా అనిపిస్తుందనీ అందుకే తన పిల్లలు కూడా పరిమితులు తెలుసుకుని, విలువలతో కూడిన జీవితాన్ని గడపాలనేదే తన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. వారికి విలాసవంతమైన జీవితం ఇవ్వాలను తాను అస్సలు భావించలేదన్నారు. నిజమైన సంపద జవాబుదారీతనంతో రావాలని,ఆర్థిక సరిహద్దులతో జీవించడం ప్రజలను నిజాయితీగా, బాధ్యతాయుతంగా ఉంచుతుందని అన్నారు.
భారీ విరాళం ప్రకటించిన యాప్ నెక్సస్ కో ఫౌండర్, మాజీ సీఈఓ బ్రియాన్ ఓ కెల్లీ
August 16, 2025
0
Tags