కేరళలో ఓ కిడ్నాప్ కేసులో మలయాళ నటి లక్ష్మీ మేనన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కొచ్చిలో ఓ ఐటీ ఉద్యోగిని స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి, అతడిపై దాడి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ ముగ్గురిని అరెస్టు చేయగా, నిందితుల్లో ఒకరిగా ఉన్న నటి పరారీలో ఉందని కొచ్చి నగర పోలీస్ కమిషనర్ విమలాదిత్య తెలిపారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అయితే, ఆమె పేరును ఎఫ్‌ఐఆర్‌లో ఇంకా చేర్చలేదని సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ బార్ వద్ద లక్ష్మీ మేనన్, ఐటీ ఉద్యోగి బృందాల మధ్య వివాదం తలెత్తింది. అక్కడితో ఆ గొడవ సద్దుమణగకపోవడంతో సదరు ఎంప్లాయిని నటి, ఆమె స్నేహితులు వెంబడించారు. అతడి కారును అడ్డగించి, బలవంతంగా తమ కారులోకి ఎక్కించి, దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఐటీ ఉద్యోగి కిడ్నాప్ కేసు : పరారీలో నటి లక్ష్మీ మేనన్
August 27, 2025
0
Tags