వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. గయానా అమెజాన్ వారియర్స్ జట్టు తరఫున సత్తా చాటుతున్నాడు. సెయింట్ లూసియా జట్టుతో జరిగిన ఓ మ్యాచ్‌లో ఈ భారీ హిట్టర్ ఒక్క బంతికి 22 పరుగులు రాబట్టడం విశేషం. అదెలా సాధ్యమైందంటే..? 15వ ఓవర్‌లో బౌలర్ థామస్ వేసిన మూడో బంతి నోబాల్ అయింది. అయితే ఈ బంతికి షెఫర్డ్ పరుగులేమీ చేయలేదు. ఆ తర్వాతి ఫ్రీహిట్ వైడ్‌గా వెళ్లింది. నెక్స్ట్ ఫ్రీహిట్‌ను షెఫర్డ్ భారీ సిక్స్‌గా మలిచాడు. అయితే అది కూడా నోబాలే. దీంతో ఆ తర్వాతి బంతినీ బ్యాటర్ బౌండరీ లైన్ ఆవలకు తరలించాడు. ఇక్కడ దురదృష్టం మరోసారి బౌలర్‌ని వెంటాడింది. అది కూడా నోబాల్‌గా తేలింది. దీంతో మూడో ఫ్రీహిట్‌నూ షెఫర్డ్ ఉపయోగించుకుని సునాయాసంగా సిక్స్‌గా మలిచాడు. దీంతో ఒక్క లీగల్ డెలివరీకి మొత్తం 22 పరుగులు వచ్చినట్లైంది. ఇలా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షెఫర్డ్ 34 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సిక్స్‌లు ఉన్నాయి.
ఒక్క బంతికి 22 పరుగులు ?
August 27, 2025
0
Tags