ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ కి చెందిన యోగేంద్ర సింగ్ గత 15 సంవత్సరాలుగా ఢిల్లీలోని కల్కాజీ ఆలయ సేవకుడిగా పని చేస్తున్నాడు. అయితే శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కొంతమంది యువకులు దర్శనం కోసం ఆలయానికి వచ్చారు. దర్శనం అనంతరం ఆలయ సేవకుడు యోగేంద్ర సింగ్ ప్రసాదం పెట్టాలని డిమాండ్ చేశారు. దీనికి యోగేంద్ర సింగ్ నిరాకరించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్త హింసాత్మక దాడిగా మారింది. ప్రసాదం పెట్టలేదని కోపంతో విచక్షణ కోల్పోయిన యువకులు ఆలయ సిబ్బంది యోగేంద్రను కర్రలతో చితకబాదారు. పిడిగుద్దులు గుద్దుతూ పదేపదే కర్రలతో కొట్టడంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చుట్టూ పక్కల ఉన్నవారు వెంటనే బాధితుడిని ఎయిమ్స్ ట్రామా సెంటర్ కు తరలించగా తీవ్రంగా గాయపడ్డ యోగేంద్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ప్రసాదం పెట్టలేదని ఆలయ సేవకుడిని కొట్టి చంపిన యువకులు : వీడియో వైరల్
August 30, 2025
0
Tags