గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు దుర్మరణం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలోఈరోజు బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు మరణించారు. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలైన ఘటనపై మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేస్తూ  ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. కూలీలు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించాల్సిందిగా అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మృతుల కుటుంబ సభ్యులకు మంత్రి నారా లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)