ఉల్లిపాయలలో తెల్లవి కూడా ఉంటాయి. ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఎర్ర ఉల్లిపాయల కన్నా తెల్ల ఉల్లిపాయలను ఎక్కువగా ఆహారంలోకి చేర్చుకుంటే, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను, ఔషధ గుణాలను శరీరానికి అందించవచ్చని నిపుణులు అంటున్నారు. వీటిలో బోలెడు ఔషధ గుణాలున్నాయి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. తెల్ల ఉల్లిపాయలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయలు తింటే శరీరంలో శక్తి పెరుగుతుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిని సూపర్ ఫుడ్ గా కూడా పరిగణిస్తారు. ఏ కూర చేసినా అందులో ఉల్లి వేస్తేనే రుచి. మీ వంటింట్లో ఏది ఉన్నా లేకున్నా ఉల్లిపాయ తప్పనిసరి ఉండాల్సిందే. ఈ ఉల్లి పాయలను సలాడులలో కూడా ఉపాయగిస్తారు. దీనిలో విటమిన్ సి, విటమిన్ b6,పోల్లెట్, పొటాషియం, మాండనీస్,కాల్షియం,మెగ్నీషియం, బాస్వరం, జింక్, రాగి,సెలీనియం, కొలిన్ ఇతర ఖనిజాలు, విటమిన్ లో పుష్కలంగా ఉంటాయి. ఉల్లిపాయలు మీ జుట్టుకు చాలా మేలు చేస్తుంది. చుండ్రు సమస్యను నివారిస్తుంది. తెల్ల ఉల్లిపాయలు రసాన్ని తలపై అప్లై చేసే కొంతసేపటి తర్వాత శుభ్రం చేసుకుంటే,జుట్టు కూడా దృఢంగా మారుతుంది. తెల్ల ఉల్లిపాయలు పోషకాలు చెడు కొలెస్ట్రాన్ని తొలగించుతుంది.చెడు కొలెస్ట్రాల సమస్యతో బాధపడుతుంటే, ప్రతిరోజు తెల్ల ఉల్లిపాయలు తినడం చాలా మంచిది.ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. బరువును తగ్గేలా చేస్తుంది. ఉల్లిపాయలు బీపీని నియంత్రిస్తుంది. శరీరాన్ని కూల్ చేస్తుంది. సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫలమేటరీ లక్షణాలు, రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది.
తెల్ల ఉల్లిపాయలు - ఆరోగ్య ప్రయోజనాలు
August 03, 2025
0
Tags