వాట్సప్‌లో స్క్రీన్ షేరింగ్‌తో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. ''కస్టమర్ సపోర్ట్, బ్యాంక్ సిబ్బంది పేరిట కాల్స్ చేసి వాట్సప్ స్క్రీన్ షేరింగ్ ఇవ్వాలని కోరితే అస్సలు నమ్మొద్దు. సాయం చేస్తామని నమ్మించి మీ అకౌంట్‌లోని డబ్బులు కాజేస్తారు జాగ్రత్త. ఖాతా వివరాలు, ఓటీపీ కాజేస్తారు. అపరిచిత కాల్స్‌తో అప్రమత్తంగా ఉండండి. ఎట్టిపరిస్థితుల్లో ఏమరపాటుగా ఉండొద్దు. మీ సన్నిహితులు, ఇంట్లోని పెద్దలకు ఇలాంటి మోసాలపై అవగాహన కల్పించండి'' అని పోలీసులు కోరారు. ''వాట్సప్ మెసేజ్‌ను నమ్మి పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తెలియని వాట్సప్ గ్రూపుల్లో చేరొద్దు. వాట్సప్ గ్రూపుల్లో వచ్చే ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ నమ్మొద్దు. ఈజీమనీ ఆశతో ఎలాంటి లింక్‌లపైనా క్లిక్ చేయొద్దు. ఫేక్ స్క్రీన్‌షాట్స్, ఫేక్ యాప్‌లతో మోసగిస్తారు. వాట్సప్ గ్రూపుల్లో వచ్చే APK ఫైల్స్‌ను ఎట్టిపరిస్థితుల్లో డౌన్‌లోడ్ చేయకండి. అపరిచితుల మాటలు నమ్మి డబ్బులు ఇవ్వకండి. పెట్టుబడి అనే కీలక నిర్ణయాన్ని అపరిచితుల సలహాలను నమ్మి తీసుకోవద్దు'' అని పోలీసులు సూచించారు.
వాట్సప్ స్క్రీన్ షేరింగ్ - తెలంగాణ పోలీసుల హెచ్చరిక
August 29, 2025
0
Tags