బ్రిటన్‌లో ఇద్దరు సిక్కులపై ఆగస్టు 15వ తేదీన ముగ్గురు స్థానిక యువకులు దాడి చేశారు. దీంతో భారీగా నిరసన వ్యక్తం అయ్యింది. వోల్వరాంప్టన్ రైల్వే స్టేషన్ సమీపంలో జాత్యంహకార దాడి జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అయ్యింది. బాధితులు గ్రౌండ్‌పై పడి ఉన్నారు. నిందితులు గట్టిగా కాలితో బాధితులను తన్నారు. ఆ దాడి సమయంలో సిక్కుల తలపాగా కిందపడిపోయింది. ఈ కేసులో ముగ్గురు టీనేజర్లను అరెస్టు చేశారు. వాళ్లను ఆ తర్వాత రిలీజ్ చేశారు. బ్రిటన్ ప్రభుత్వంతో ఈ అంశాన్ని చర్చించాలని శిరోమని అకాలీ దళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కోరారు.
బ్రిటన్‌లో ఇద్దరు సిక్కులపై జాత్యంహకార దాడి : సోషల్ మీడియాలో వీడియో వైరల్
August 19, 2025
0
Tags