సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణం కల్పించేందుకు ఇప్పటికే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ముఖ్యంగా గుర్తింపు కార్డులతో ఐదు రకాల ఆర్టీసీ సర్వీసుల్లో మహిళలకు అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఎక్కడ నుంచి ఎక్కడికైన ఉచిత బస్సు సర్వీసు సదుపాయంను కల్పించనున్నారు. ఆడపిల్లలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచిత బస్సు ప్రయాణం పథకంను అమలు చేసే దిశగా ప్రభుత్వం మార్గదర్శకాలను అమలుకు రంగం సిద్దం చేసింది. ఈ క్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ ద్వారక తిరుమల రావు మాట్లాడుతూ.. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని తెలిపారు. అంతే కాకుండా.. భద్రత కారణాల రీత్యా.. తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో ఉచిత బస్సు పథకం వర్తింపజేయడం లేదని ఆర్టీసీ చైర్మన్ ద్వారక తిరుమల రావు ఒక ప్రకటన జారీ చేశారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం ఉంటుందని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా జీరో టికెట్ అమల్లో ఉంటుదన్నారు. బస్సులలో రద్దీని బట్టి బస్సుల్ని పెంచడానికి తగిన చర్యల్ని తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మరిన్ని పల్లెవెలుగు, ఏసీ, సిటీ ఆర్డినరీ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఒక ప్రకటనలో వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)