ఢిల్లీలోని బధ్ కాల్ మోర్ స్టేషన్ మెట్రో ట్రైన్ లో మహిళలు కొట్టుకున్నారు. మెట్రోలో సీట్లు ఖాళీగా ఉన్నా ఇద్దరు మహిళలు ఒకర్నొకరు జుట్టు పట్టుకుని ఇష్టమొచ్చినట్లు కొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు మహిళలు ఒకరితో ఒకరు గొడవ పడుతుండటం కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్లు రాకరకాలకు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాదాన్ని డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ తో పోలుస్తున్నారు. ఢిల్లీలోని బధ్ కాల్ మోర్ స్టేషన్ పరిధిలో రైలు ఎక్కిన ఇద్దరు మహిళలు సీటు కోసం గొడవ పడినట్లు తెలుస్తోంది. అయితే వాళ్లు కొట్టుకునే సమయంలో సీటు ఖాళీగానే ఉండటం గమనార్హం. మెట్రో రైలులో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య మాటా మాటా పెరిగింది. ఇద్దరూ జుట్టు, జుట్టు పట్టుకుని ఒకరినొకరు కొట్టుకున్నారు. అక్కడే ఉన్న మరో మహిళ వారిని ఆపేందుకు ప్రయత్నించింది. అయినా ఆమె ప్రయత్నం విఫలమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఢిల్లీ మెట్రోలో కొట్టుకున్న మహిళలు : వీడియో వైరల్
August 26, 2025
0
Tags