మున్సిపల్‌, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదం

Telugu Lo Computer
0


తెలంగాణ శాసనసభ మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ చట్టసవరణ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశముంది. తొలుత మున్సిపల్‌, తర్వాత పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టి చర్చించారు. అనంతరం ఆ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు బిల్లులపై చర్చ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. బీసీలు అంచెలంచెలుగా ఎదగాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు 42 శాతం రిజర్వేషన్లు తీసుకొని బలపడాలని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ అని చెప్పారు. బిల్లుకు భాజపా, భారత రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. ఆ పార్టీలో బీసీ నేతకు శాసనసభాపక్ష నేత పదవి ఇస్తారని అనుకున్నామని.. కానీ అలా జరగలేదన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిని కూడా బీసీని చేయలేదని ఎద్దేవా చేశారు. 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామన్నారు. 42 శాతం పక్కాగా బీసీలకే అమలు చేస్తామని మంత్రి చెప్పారు. బీసీ బిల్లుకు అసెంబ్లీలో మద్దతు తెలుపుతూ.. కేంద్రంలో ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు. ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడం వల్లే అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లలేదని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరగాలని కోరుకోవాలి తప్పితే.. వ్యతిరేకంగా ఎందుకు ఆలోచించాలన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)