ప్రముఖ నటి, సమాజ్‌వాది పార్టీ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిపై జయాబచ్చన్ అసహనంగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్‌నెట్‌లో వైరలవుతోంది. తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని సీరియస్‌గా పక్కకు తోసేశారు. 'ఏం చేస్తున్నావు ..ఏంటిది ?' అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా హతాశులయ్యారు. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. చిన్న విషయాలకే సహనం కోల్పోతున్న జయాబచ్చన్ తీరుపై నెటిజన్‌లు విస్తుపోతున్నారు.
సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని పక్కకు తోసేసిన జయా బచ్చన్ !
August 12, 2025
0
Tags