బ్యాంకు పొదుపు ఖాతాల్లో కనీస సగటు బ్యాలెన్స్ పరిమితిని నిర్ణయించుకునే స్వేచ్ఛ పూర్తిగా ఆయా బ్యాంకులకే ఉంటుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఈ విషయం తమ నియంత్రణ పరిధిలోకి రాదని ఆయన తేల్చిచెప్పారు. దేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ, కొత్త ఖాతాదారులకు కనీస బ్యాలెన్స్ పరిమితిని భారీగా పెంచిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోమవారం గుజరాత్‌లో జరిగిన ఒక ఆర్థిక సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న సంజయ్ మల్హోత్రా, ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త నిబంధనలపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. 'కనీస బ్యాలెన్స్‌ను ఎంత ఉంచాలనేది బ్యాంకుల విచక్షణకే వదిలేశాం. కొన్ని బ్యాంకులు ఈ పరిమితిని రూ.10,000గా నిర్ణయిస్తే, మరికొన్ని రూ.2,000గా ఉంచాయి. చాలా బ్యాంకులు ఈ నిబంధనను పూర్తిగా తొలగించాయి కూడా,' అని ఆయన వివరించారు.
కనీస సగటు బ్యాలెన్స్ పరిమితిని నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆయా బ్యాంకులకే ఉంటుంది !
August 11, 2025
0
Tags