హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాలపై ఎం సీఆర్హెచ్ఆర్డీలో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డీజీపీ జితేందర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హైదరాబాద్ , సైబరాబాద్ , రాచకొండ పోలీస్ కమిషనర్లు, హైదరాబాద్ ,మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు , ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల సహకారంతో గణేష్ ఉత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా జరుపుకుంటాం. అధికారులు గణేష్ ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. గత సంవత్సరం ముఖ్యమంత్రి గణేష్ ఉత్సవాలకు మండపాలకు ఉచిత విద్యుత్ అందించారు. ప్రభుత్వం గణేష్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర రాజధాని లో జరుగుతున్న అతి పెద్ద వేడుక గణేష్ ఉత్సవాలు. ఆర్ అండ్ బి, జీహెచ్ ఎంసీ, రెవెన్యూ, పోలీస్ ,హెల్త్ , విద్యుత్ అన్ని విభాగాలు సమన్వయం చేసుకొని పని చేయాలి. ఇక్కడికి వచ్చే ముందే అన్ని డిపార్ట్ మెంట్‌లు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు శాంతి భద్రతలు, మండపాల వద్ద విద్యుత్ జాగ్రత్తలు , ట్రాఫిక్ ఇబ్బందులు, విగ్రహాలకు వాహనాలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని మంత్రి పొన్నం సూచించారు.
గణేష్ ఉత్సవాలను శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి !
August 19, 2025
0
Tags