కేంద్ర హోం మంత్రి అమిత్ షా సరికొత్త రికార్డు నెలకొల్పారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం కేంద్ర హోంశాఖ మంత్రిగా పని చేసిన వ్యక్తిగా అమిత్ షా రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకూ బీజేపీ అగ్ర నేత ఎల్‌కే అద్వానీ పేరుతో ఉన్న రికార్డును షా బద్దలు కొట్టారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక అమిత్‌షా 2019లో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. ఆ తర్వాత జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది. దీంతో షా వరుసగా రెండోసారి కూడా హోంశాఖ బాధ్యతలనే స్వీకరించారు. దీంతో షా హోంశాఖ బాధ్యతలు స్వీకరించి నేటికి ఆరు సంవత్సరాల 64 రోజులు పూర్తైంది. దాదాపు 2,194 రోజులు అమిత్ షా హోం మంత్రిగా పనిచేశారు. ఫలితంగా బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ రికార్డును షా బద్దలుకొట్టారు. 1998-1999, 1999-2004 వరకూ ఎల్‌కే అద్వానీ కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. దాదాపు 2,193 రోజులు అద్వానీ ఈ పదవిలో కొనసాగారు. ఇప్పుడు ఆ రికార్డును అమిత్ షా అధిగమించారు.
ఎల్‌కే అద్వానీ రికార్డును అధిగమించిన అమిత్‌షా
August 05, 2025
0
Tags