హైదరాబాద్ నగరంలో కుండ పోత వర్షం కురుస్తోంది. సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. భాగ్యనగరంలోని అనేక ప్రాంతాలు భారీ ఎత్తున వర్షపు నీరు నిలిచిపోయింది. సెక్రటేరియట్ బస్టాప్, సిటీ సెంట్రల్ జోన్ నీట మునిగాయి. ట్యాంక్ బండ్-సెక్రటేరియట్ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, నారాయణగూడ పరిసర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద నిలిచిపోయిన వర్షపు నీరు నిలిచిపోవడంతో.. ఖైరతాబాద్- పంజాగుట్ట మార్గంలో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఖైరతాబాద్ వాటర్ బోర్డు కార్యాలయం వెనుక ఓ ప్రైవేట్ స్కూల్ నీట మునిగింది. వందలాది మంది విద్యార్థులు స్కూల్లోనే చిక్కుకుపోయారు.
హైదరాబాద్‌లో కుండపోత వర్షం
August 04, 2025
0
Tags