ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

Telugu Lo Computer
0


ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులను తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఆదేశించారు. అవసరమైన అనుమతులపై త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ నిర్వహిస్తారని చెప్పారు. శుక్రవారం నీటిపారుదశాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మూడు దశాబ్దాల తర్వాత నీటిపారుదల శాఖలో పదోన్నతులు, బదిలీలు జరుగుతున్నట్లు చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ప్రమాదం తర్వాత నిపుణుల కమిటీ సిఫార్సులతో తిరిగి పనులు మొదలుపెట్టాలి. ముఖ్యమైన ప్రాజెక్టు 9 కి.మీ పనికే నిలిచిపోవడం దురదృష్టకరం. ఎస్‌ఎల్‌బీసీ పూర్తి కానందున ఎత్తిపోతలకు ఏటా రూ.750 కోట్లు ఖర్చవుతోంది. అత్యాధునిక సాంకేతికతతో ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్జీఆర్‌ఐ సర్వేతో భూగర్భం కి.మీ దిగువ వరకు మ్యాపింగ్‌ చేయొచ్చు. కచ్చితమైన ప్రణాళిక కోసం లైడార్‌ సర్వే కూడా చేస్తాం. నాణ్యతలో రాజీపడకుండా మంత్రివర్గం ఆమోదించిన అంచనాతో ప్రాజెక్టు పనులు చేపట్టాలి''అని మంత్రి తెలిపారు. మరోవైపు ఎస్‌ఎల్‌బీసీ సొరంగానికి హెలికాప్టర్‌తో మాగ్నెటిక్‌ జియోఫిజికల్‌ సర్వేకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రూ.2.36 కోట్లతో నామినేషన్‌ పద్ధతిన ఎన్జీఆర్‌ఐకి పనులు అప్పగించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)