స్కూళ్లలోకి బయటి వ్యక్తులు, రాజకీయ నాయకుల ప్రవేశంపై నిషేధం విధించిన ఏపీ ప్రభుత్వం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లలోకి బయటి వ్యక్తులు, రాజకీయ నాయకుల ప్రవేశంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే రాజకీయ పార్టీల పోస్టర్లు, గుర్తులు, బ్యానర్ల ప్రదర్శనపైనా నిషేధం విధించింది. పాఠశాల ఆవరణలోకి తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు తప్ప ఏ ఇతర అనధికారిక వ్యక్తులను అనుమతించరాదని ఆదేశించింది. విద్యార్థులకు కానుకలు, స్కూళ్లకు విరాళాలు ఇవ్వాలన్నా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని తేల్చి చెప్పింది. విద్యార్థుల ఫోటోలు తీయొద్దంది. విద్యార్థులను, టీచర్లను బయటివారు కలవడానికి వీల్లేదని, ఫిర్యాదులు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)