హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మహానగరం తడిసి ముద్దవుతుంది. వరుసగా ప్రతి రోజు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో భారీ వర్షం కురుస్తునే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. రహదారులపై సైతం భారీగా వర్షపు నీరు నిలిచిపోతుంది. డ్రైనేజీలోని మురుగు నీరు సైతం రహదారులపైకి వచ్చి భారీగా చేరుతుంది. అలాగే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఆదివారం హైదరాబాద్‌లోని వరద ముంపు ప్రాంతాలను ఉన్నతాధికారులతో కలిసి ఆయన స్వయంగా పరిశీలించారు. ఆ క్రమంలో బల్కంపేటలోని ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అందులోభాగంగా బస్తీ వాసులతో ఆయన మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మంచి నీరు ఎలా వస్తుంది. అందులో ఏమైనా మురుగు నీరు కలుస్తుందా? అంటూ వారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే మైత్రీవనం సమీపంలోని గంగూబాయి బస్తీని సైతం ఆయన సందర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్‌లోని వరద ముంపు ప్రాంతాలను ఉన్నతాధికారులతో కలిసి స్వయంగా పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
August 10, 2025
0
Tags