పార్-తాపి నర్మదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గిరిజనులు భారీ నిరసన

Telugu Lo Computer
0


గుజరాత్‌లో వేలాది మంది గిరిజనులు పార్-తాపి నర్మదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా భారీ నిరసన చేపట్టారు. తమ ఇళ్ళు, సంస్కృతి, జీవనోపాధిని నాశనం చేసే ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తొమ్మిది డ్యాముల నిర్మాణంతో మూడు ప్రధాన నదులను అనుసంధానించే పార్-తాపి నర్మదా లింక్‌ ప్రాజెక్టుపై దక్షిణ గుజరాత్‌లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కాగా, వల్సాద్‌ జిల్లాకు చెందిన వేలాది మంది గిరిజనులు గురువారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. డ్యామ్ హటావో సమితి బ్యానర్ కింద ఐక్యమయ్యారు. లారీలు, ట్రాక్టర్లలో వేలాది మంది ఆదివాసీలు ధరంపూర్‌కు తరలివచ్చారు. పార్-తాపి నర్మదా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ప్రాజెక్ట్‌ వల్ల తమ ఇళ్ళు, సంస్కృతి, జీవనోపాధి నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు పరిహారం వద్దని, ఈ ప్రాజెక్టును పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)