మహారాష్ట్రలోని పుణెకు చెందిన కొరెగావ్ పార్క్‌లో సెప్టెంబర్ 4న నాలుగో యాపిల్ స్టోర్‌ను ప్రారంభించనుంది. బెంగళూరులోని స్టోర్ మాదిరిగానే పుణెలోని స్టోర్‌ను కూడా నెమలి కళాకృతితో తీర్చిదిద్దారు. ఈ స్టోర్ 10 వేల చదరపు అడుగుల వైశాల్యంలో విస్తరించి ఉంటుందని తెలుస్తోంది. కొత్త ఐఫోన్ 17 లాంచ్ కానున్న నేపథ్యంలో ఈ ప్రారంభంపై ప్రకటన వచ్చింది. ఇప్పటికే ముంబయి, ఢిల్లీ, బెంగళూరులో స్టోర్లు ఉన్నాయి. భారత్‌లో వ్యాపార వృద్ధికి ఇంకా భారీ అవకాశాలున్నాయని గతంలో వ్యాఖ్యానించిన యాపిల్ సీఈఓ టిమ్‌కుక్ అందుకు అనుగుణంగా దేశంలో నాలుగు రిటైల్ స్టోర్లు నెలకొల్పుతామని చెప్పిన సంగతి తెలిసిందే. త్వరలో విడుదల కాబోయే ఐఫోన్ 17 మోడళ్లన్నింటినీ (ప్రో వెర్షన్లు సహా) దేశంలోనే తయారుచేయాలని యాపిల్ నిర్ణయించింది. చైనా మీద ఆధారపడడాన్ని తగ్గించి, అమెరికాకు ఎగుమతులపై టారిఫ్ రిస్క్‌లను తప్పించుకోవడానికి యాపిల్ ఈ వ్యూహాత్మక ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ నుంచి అమెరికాకు ఐఫోన్ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. యాపిల్ రాబోయే అన్ని ఐఫోన్ 17 మోడళ్లను భారత్‌లోని ఐదు ప్లాంట్లలో చేపట్టనుంది. విడుదలకు ముందే ప్రో వెర్షన్లు సహా అన్ని కొత్త ఐఫోన్ మోడళ్లను భారత్‌లోనే తయారుచేయడం ఇదే మొదటిసారి.
పుణెలో సెప్టెంబర్ 4న యాపిల్ నాలుగో స్టోర్ ప్రారంభం
August 26, 2025
0
Tags