ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు. ఇవాళ కేబినెట్ సమావేశంలో 33 అంశాలకు ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ సర్క్యులర్ ఎకానమీ, 4.0 ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది అన్నారు.. వేస్ట్ మేనేజ్మెంట్ కు సంబంధించి చెత్త నుంచి సంపద సృష్టికి సంబంధించిన పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు.. పర్యావరణాన్ని కాపాడుకునే ఉద్దేశంతో వ్యర్థాలని రిసైక్లింగ్ కి వాడుకునే విధంగా చెత్త నుంచి సంపదని సృష్టించే విధంగా మంత్రివర్గం అమోదించిడం జరిగిందని.. దీని ద్వారా MSME పరిశ్రమలు నెలకొల్పుకునేందుకు ఉపయోగపడనుందని వెల్లడించారు.. టూరిజం అభివృద్ధిలో భాగంగా భూ కేటాయింపులకి కేబినేట్ ఆమోదం తెలిపిందని వీటి ద్వారా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. అలాగే జలవనరులశాఖ పనులకు సంబంధించి మరో 11 అంశాలకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ (4.0) 2025-30కి ఆమోదం తెలపగా, పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేసింది.. అధికారిక భాష కమిషన్ పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాష సంఘం’గా మార్పునకు ఆమోదముద్ర వేసింది. సాగు భూమిని వ్యవసాయేతరంగా మార్పునకు నాలా చట్ట సవరణలకు ఆమోదం తెలిపింది. 51వ సీఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు, రాజధాని పరిధి 29 గ్రామాల్లో రూ.904 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఆర్డీఏ పరిధిలో సంస్థలకు భూకేటాయింపునకు ఆమోదం లభించగా, మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
33 అంశాలకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్
August 21, 2025
0

Tags