రాఖీ పండుగ సందర్భంగా 30% బస్సు చార్జీలు పెంచిన టీఎస్ఆర్టీసీ

Telugu Lo Computer
0


రాఖీ పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలు హఠాత్తుగా పెరిగాయి. ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30% వరకు పెంచింది. పండగల సీజన్‌లో టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్ నుండి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వెళ్లేందుకు ఎక్స్ ప్రెస్ బస్సు ఎక్కినప్పుడు, ఒక్కరికి రూ. 220 బదులు రూ. 330 వసూలు చేశారని ఆరోపించారు ప్రయాణికులు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి, ఆ భారాన్ని పురుషులపై మోపుతున్నారని అసహనం తెలిపారు. తమ సోదరులకు రాఖీ కట్టేందుకు పెద్ద ఎత్తున అక్కాచెల్లెళ్లు బయల్దేరారు. ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోయాయి. 'రాఖీ స్పెషల్‌' పేరుతో తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు అందిస్తోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ వంటి బస్సుల్లో ముందే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. దీంతో నేరుగా బస్టాండ్లకు చేరుకున్న ప్రయాణికులు తీవ్ర నిరాశ పడుతున్నారు. అదనంగా మరికొన్ని బస్సులు అందించాలని కోరుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)